ETV Bharat / state

Extreme Drought Conditions in Andhra Pradesh: రాష్ట్రంలో కరవు తాండవిస్తున్నా.. మొద్దునిద్ర వీడని జగన్ సర్కార్ - deficit rainfall in andhra pradesh

Extreme Drought Conditions in Andhra Pradesh: రాష్ట్రంలో కరవు తీవ్రత అంతకంతకు పెరుగుతున్నా.. ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదు. పైగా దాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఎండుతున్న పంటల్ని చూస్తున్న రైతులకు.. వాటిపై పెట్టిన పెట్టుబడి, తెచ్చిన అప్పులే కనిపిస్తున్నాయి. లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంటలు వానల్లేక, కాలువల్లో నీరులేక వడలిపోతున్నాయి. ఇలాంటి దుర్భిక్ష పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం ఉన్నా సాగు స్థితిగతుల్ని సమీక్షిస్తుంది. కానీ.. వైసీపీ సర్కారుకు మాత్రం అన్నదాతల గోడు వినపడటం లేదు.

Extreme Drought Conditions in Andhra Pradesh

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 29, 2023, 7:19 AM IST

Extreme Drought Conditions in Andhra Pradesh: రాష్ట్రంలో కరవు తాండవిస్తున్నా.. మొద్దునిద్ర వీడని జగన్ సర్కార్..

Extreme Drought Conditions in Andhra Pradesh: తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కాలువల్లో నీరు లేక.. అనేక జిల్లాల్లో కరవు కోరలు చాస్తున్నా.. ప్రభుత్వంలో చలనం లేదు. పంట పోతే చేసిన అప్పులు తీర్చేదెలా? అనే ఆవేదనతో రైతు కుటుంబాలు కుంగిపోతున్నా.. సీఎం జగన్‌లో ఉలుకూ, పలుకూ లేదు. వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి కూడా రైతుల గోడు పట్టడం లేదు. కరవైతే ఏంటి..? మనం పట్టించుకోకుంటే సరి.. ఎవరేం చేస్తారు? అంతగా రోడ్డెక్కితే పోలీసులే చూసుకుంటార్లే అనే ధీమా కావచ్చు. రైతుల కష్టాల్ని పట్టించుకోవడమే మానేశారు.

తలకిందులవుతున్న రైతుల జీవితాలు: కరవు పరిస్థితిపై కనీసం సమీక్షించనే లేదు. కాల్వలకు నీరు ఎందుకు వెళ్లడం లేదు, రైతులు రోడ్లపైకి అసలు ఎందుకు వస్తున్నారు అని ఆరా తీసిన దాఖలాలూ లేవు. ఖరీఫ్‌లో 24 లక్షల ఎకరాలలో పంటల సాగు తగ్గడమంటే.. రాష్ట్రంలో వ్యవసాయ రంగం ప్రమాదఘంటికలు మోగిస్తున్నట్లే. వేల కోట్ల పంట ఉత్పత్తి తగ్గిపోతుంది. లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంటలు వర్షాలు లేక ఎండిపోతున్నాయంటే.. లక్షలాది మంది రైతు కుటుంబాల జీవితాలు తలకిందులవుతున్నాయనే అర్థం. ఇంతటి దుర్భిక్ష పరిస్థితుల్లోనూ సాగు స్థితిగతులపై సమీక్షలు లేవు.

Vizianagaram Farmers Fear Severe Crop Loss: నీరు లేక రైతు కంట కన్నీరు.. ఎండుతున్న పంటలు చూసి బరువెక్కుతున్న గుండెలు

కరవును కప్పిపెట్టే ప్రయత్నం: రైతు సంక్షేమ ప్రభుత్వమంటూ నామస్మరణ చేసే వైసీపీ పెద్దలు మాత్రం.. రైతు ఎండితే మనదేం పోయిందన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విస్తారంగా వానలు కురుస్తున్నాయని, రైతులు సుభిక్షంగా ఉన్నారంటూ.. నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కల్లబొల్లి మాటలతో.. కరవును కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

పప్పు ధాన్యాల రైతులు ఎకరాకు 20 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. వరికి 30 వేలు, పత్తికి 35 వేల రూపాయల వరకు పెట్టుబడి చేరింది. మిరప రైతులు ఎకరాకు లక్ష వరకు ఇప్పటికే ఖర్చు చేశారు. ఈ దశలో పంటలు ఎండిపోతుండటంతో.. పెట్టుబడిలో 10 శాతమైనా చేతికి వస్తుందా? అనేది అనుమానమే. మొత్తంగా వేల కోట్లలో రైతులు నష్టపోయే పరిస్థితులు దాపురించాయి.

Extreme Drought Conditions in Anantapur : కరువు.. దరువు..! జాడలేని చినుకు.. కళ్లెదుటే ఎండుతున్న పంటల్లో రైతన్న కన్నీళ్లు

గణాంకాలను వెల్లడించడం లేదు: ఖరీఫ్‌లో వర్షాలు అనుకూలించకపోవడంతో కర్నూలు జిల్లాలో పత్తి తొలగించారు. గత నెలలో అడపాదడపా అక్కడక్కడా వానలు పడటంతో వేరుసెనగ, జొన్న సాగు చేశారు. నెల నుంచి వానలు లేక అది కాస్తా ఎండిపోయింది. ఇక పంటపై ఆశలు వదిలేసుకున్నట్లే అని రైతులు వాపోతున్నారు. రబీలోనూ పంటల సాగు ఆశాజనకంగా లేదు. సెనగ సాగు మందగించింది. వ్యవసాయశాఖ సాగు గణాంకాలనే వెల్లడించడం లేదు.

కరవు కళ్లముందే కనిపిస్తున్నా పట్టించుకున్నదే లేదు: రబీ మొదలై పదిహేను రోజులకుపైగా అవుతున్నా.. ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల్లో పంటలు వేశారనే వివరాలనూ బయట పెట్టడం లేదు. సాగు లెక్కలు తగ్గితే.. ప్రభుత్వానికి ఇబ్బంది అన్నట్లుగా వ్యవహరిస్తోంది. కరవు కళ్లముందే కనిపిస్తున్నా.. వైసీపీ ప్రభుత్వం పట్టించుకున్నది లేదు. ఇప్పటి వరకు తీసుకున్న ఉపశమన చర్యలు లేవు. కరవు మండలాల ప్రకటన చేయలేదు. వైసీపీ ప్రభుత్వానికి ఇదేమీ కొత్త కాదు. గతేడాది కూడా రాయలసీమలో పలుచోట్ల కరవు పరిస్థితులున్నాయి.

Groundnut Farmers Removing Crop: కరవుతో 'అనంత' రైతు విలవిల.. ఎండిన పంటను తొలగిస్తూ కన్నీటి పర్యంతం

వలసబాట పట్టిన కుటుంబాలు: సాధారణ విస్తీర్ణం కంటే వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు 18 లక్షల ఎకరాలు తగ్గగా.. 273 మండలాల్లో పొడి వాతావరణం ఉందని ప్రభుత్వ లెక్కలు వెల్లడించాయి. అన్నమయ్య జిల్లాలో సాధారణం కంటే 45% సాగు తక్కువగా నమోదైంది. పంటలు చేతికి రాక.. పనుల్లేక కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ తదితర జిల్లాల నుంచి లక్షల సంఖ్యలో కుటుంబాలు వలసబాట పట్టాయి.

అయినా ప్రభుత్వం కరవు మండలంగా ఒక్కటి కూడా ప్రకటించలేదు. 2020 ఖరీఫ్‌లో రాయలసీమలో 14 లక్షల 27 వేల ఎకరాల్లో వేరుసెనగ ఎండిపోయింది. 3 లక్షల 27 వేల టన్నుల ఉత్పత్తి నష్టం తలెత్తింది. 4 లక్షల 71 వేల మంది రైతులు 17వందల 50 కోట్ల మేర నష్టపోయారు. అయినా కరవు అనేందుకు ప్రభుత్వానికి మనసు రాలేదు.

NO Relief Actions on Drought Situation In AP జగనన్న.. రైతన్న గోడు వినిపించడం లేదా! వర్షాభావ పరిస్థితులపై మొద్దు నిద్ర వీడేది ఎప్పుడు..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.