Southwest Monsoon 2023 Updates : బంగాళాఖాతంలో మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. అండమాన్ నికోబార్ దీవులు సహా తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నట్టు భారత వాతావరణ విభాగం తెలియచేసింది. రాగల రెండు రోజుల్లో శ్రీలంక సమీపంలోని కామోరిన్ ప్రాంతంతో పాటు మాల్దీవులకు రుతుపవనాలు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణగాలుల ప్రభావం క్రమంగా తగ్గుతోందని వాతావరణశాఖ తెలిపింది. రాగల రెండు మూడు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నాయని వెల్లడించింది.
రుతు పవనాల రాక అలస్యం : నైరుతి రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. అండమాన్ నికోబార్ దీవులు సహా తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నట్టు భారత వాతావరణ విభాగం తెలియచేసింది. రాగల రెండు రోజుల్లో శ్రీలంక సమీపంలోని కామోరిన్ సహా మాల్దీవులు పరిసర ప్రాంతాలకు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది. వాస్తవానికి జూన్ 1 తేదీ నాటికే నైరుతి రుతుపవనాలు విస్తరించాల్సి ఉన్నా.. బంగాళాఖాతంలోని వాతావరణ పరిస్థితులు, ఎల్ నినో పరిస్థితులు, సముద్ర ఉష్ణోగ్రతల కారణంగా రుతుపవనాలు కేరళలో ప్రవేశించేందుకు ఆలస్యమవుతున్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి : షాక్ కొడుతున్న విద్యుత్ స్తంభాలు.. భయాందోళనలో ప్రజలు
రాబోయే ఐదు రోజుల్లో వర్షాలు : ప్రస్తుతం కోస్తాంధ్ర, తెలంగాణా, విదర్భ, మరాఠ్వాడ ప్రాంతాల్లో హీట్ వేవ్ పరిస్థితులు కొంత మేర దిగివచ్చినా .. మరో వారం రోజుల పాటు గరిష్ఠ స్థాయిలోనే ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే సూచనలు ఉన్నాయని తెలిపింది. మరోవైపు రాగల ఐదు రోజుల్లో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలియచేసింది. కోస్తాంధ్రలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో స్వల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గు ముఖం పట్టాయి.
ముందస్తు రుతుపవనాలకు అవకాశం : ప్రస్తుతం విదర్భ, తెలంగాణ, మరట్వాడ తదితర ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాగల రెండు మూడు రోజుల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలియజేసింది. మరోవైపు జూన్ నెలలోనూ గరిష్ఠ స్థాయిలోనే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశముందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా నమోదైనప్పటికీ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో ముందస్తు రుతుపవన జల్లులు పడే అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది.
ఇవీ చదవండి :