ETV Bharat / state

నా భర్త పార్టీ మారతానంటే నేను ఆయనతోనే:మాజీ మంత్రి సుచరిత - EX MINISTER SUCHARITA

MLA SUCHARITA COMMENTS : రాజకీయాల్లో ఉన్నన్ని నాళ్లు.. తమ కుటుంబం జగన్‌తోనే ఉంటుందని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ హోం మంత్రి.. మేకతోటి సుచరిత అన్నారు. ఈ విషయంలో తనది, తన భర్త దయాసాగర్‌ది ఒకే మాట అని చెప్పుకొచ్చారు.

EX MINISTER SUCHARITA
EX MINISTER SUCHARITA
author img

By

Published : Jan 5, 2023, 10:35 AM IST

EX MINISTER SUCHARITA : రాజకీయంగా తమ మనుగడ అంటే అది వైసీపీతోనే అని మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పేర్కొన్నారు. సుచరిత ఆ స్టేట్‌మెంట్‌ ఇచ్చిందంటే తన భర్త దయాసాగర్‌ కూడా దానికి కట్టుబడి ఉంటారని తెలిపారు. అలా కాకుండా దయాసాగర్‌ పార్టీ మారతాను.. నన్ను తనతో పాటు రమ్మంటే వెళ్తానని తెలిపారు. తాను ఎంత రాజకీయ నాయకురాలినైనా, ఒక భార్యగా తన భర్త అడుగుజాడల్లో నడుస్తానని ఆమె వ్యాఖ్యానించారు.

"రాజకీయంగా మా మనుగడ వైకాపాతోనే. నా భర్త దయాసాగర్ కూడా నా స్టేట్​మెంట్​కి కట్టుబడే ఉంటారు. ఒకవేళ నా భర్త పార్టీ మారతానంటే.. ఎంత రాజకీయ నాయకురాలినైనా భర్త అడుగుజాడల్లో నడవాలి కాబట్టి ఆయనతో పాటు వెళ్లాల్సిందే. నా భర్త ఒక పార్టీలో.. నేను మరో పార్టీలో.. మా పిల్లలు మరో పార్టీలో ఉండరు"-సుచరిత, మాజీ మంత్రి

గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... ‘దయాసాగర్‌ ఒక పార్టీలో, సుచరిత ఇంకో పార్టీలో, పిల్లలు చెరొక పార్టీలో ఉండరని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి పార్టీతో మనగలిగినన్ని రోజులు ఉండాలని అనుకుంటున్నట్లు తెలిపారు. తామంతా వైసీపీ కుటుంబ సభ్యులని.. ఒకే ఇంట్లో ఉండే ఐదుగురిలో కూడా విబేధాలు ఉంటాయని.. అంత మాత్రాన వారు వేరని కాదు అని ఆమె పేర్కొన్నారు.

నా భర్త పార్టీ మారతానంటే నేను ఆయనతోనే

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.