Dharna at various Collectorates of the State: అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఉద్యోగ భద్రత కల్పిస్తానన్న సీఎం జగన్....నాలుగేళ్లు అవుతున్నా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని 108 ఒప్పంద కార్మికులు మండిపడుతున్నారు. తమ సమస్యల్ని పరిష్కారించాలంటూ ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తమను మోసం చేసిందంటూ విజయవాడ ధర్నాచౌక్‌లో ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని వాపోతున్నారు. ఈపీఎఫ్‌కు సంబంధించిన యాజమాన్య కోటాను కూడా ఉద్యోగుల జీతంలో నుంచి మినహాయిస్తున్నారని నెల్లూరులో 108 సిబ్బంది ఆరోపించారు.
తమను ఒప్పంద ఉద్యోగులుగా గుర్తించాలని కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అకారణంగా తొలగించిన 75 మంది ఉద్యోగుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కర్నూలు జిల్లా 108 కార్మికులు డిమాండ్ చేశారు. సమస్యలపై అధికారులతో జరుపుతున్న చర్చలు సఫలం కాకపోతే సమ్మెకు దిగుతామని 108 ఒప్పంద ఉద్యోగులు హెచ్చరించారు.
ఇవీ చదవండి: