గుంటూరు జిల్లాలో విద్యుత్ అక్రమ చౌర్యానికి పాల్పడుతున్న వారిపై విద్యుత్ విజిలెన్స్ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. 11 మంది అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో అనుమతి లేకుండా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న 58 మందిని గుర్తించి రూ. 4.64 లక్షల అపరాధ రుసుము విధించారు. మీటర్ ఉన్నప్పటికీ అక్రమంగా విద్యుత్‌ను వినియోగిస్తున్న 82 మంది నుంచి రూ. 12.62 లక్షల జరిమానా విధించారు. అనుమతించిన లోడు కంటే అదనంగా విద్యుత్ వాడుకుంటున్న 299 మంది వినియోగదారులను గుర్తించిన అధికారులు... రూ.33.70 లక్షల వసూలుకు నోటీసులు పంపించారు.
వివిధ కారణాలతో వాడకం కంటే తక్కువ బిల్లు ఇచ్చిన 60 సర్వీసు మీటర్లను గుర్తించి రూ. 70.79 లక్షలకు నోటీసులు అందించారు. జిల్లాలో మొత్తం 648 సర్వీసులకు గాను రూ.1.38 కోట్ల వసూలుకు అధికారులు నోటీసులు జారీచేశారు. విద్యుత్ చౌర్యం నేరమని... దానిపై ఫిర్యాదులను పూర్తి వివరాలతో 94408 12263 లేదా 8331021847 ఫోన్ నంబర్లకు నేరుగా లేదా వాట్సప్ ద్వారా సమాచారం ఇవ్వాలని విద్యుత్ విజిలెన్స్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు విజయకృష్ణ, కేవీ మూర్తి తెలిపారు.
ఇదీ చదవండి: