SNAKE DIED WITH ELECTRIC SHOCK: గుంటూరు జిల్లాలో పాము కారణంగా కరెంటు సరఫరా నిలిచిపోయింది. మేడికొండూరు మండలంలోని పేరెచర్ల సబ్ స్టేషన్లోకి పాము వచ్చి.. విద్యుత్ లైన్లపైకి ఎక్కింది. అటూ ఇటూ తిరిగే క్రమంలో.. విద్యుదాఘాతానికి గురై చనిపోయింది. షాక్ వల్ల ఇన్సులేటర్లు దెబ్బతిన్నాయి. దీంతో మండలం మొత్తానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనూహ్యంగా కరెంటు పోవటంతో విద్యుత్ శాఖ అధికారులు అవాక్కయ్యారు. ఏమైందా అని పరిశీలిస్తే.. కరెంటు లైన్‌పై చనిపోయిన పాము కనపడింది. మొత్తానికి పాము కారణంగా దాదాపు 2గంటల పాటు కరెంటు సరఫరాలో అంతరాయం తప్పలేదు. అయితే పాముకు షాక్ తగిలినప్పుడు కరెంట్ తీగలు తెగిపడితే పెను ప్రమాదం జరిగి ఉండేదని పలువురంటున్నారు.
ఇవీ చదవండి: