జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వటంపై.. గుంటూరు జిల్లాలో ఎన్నికల అధికారులు గందరగోళంలో పడిపోయారు. హైకోర్టు స్టే విధించినప్పటికీ.. ఎన్నికల సంఘం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు వారికి అందలేదు. ఈ పరిస్థితుల్లో.. ఎన్నికల అధికారులు ఏం చేయాలనే సందిగ్ధంలో ఉన్నారు. ఈ నెల 8 వ తేదిన పోలింగ్ జరగాల్సి ఉండగా... జిల్లాలో అధికారులు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే పోలింగ్ సామగ్రి ఆయా మండల కేంద్రాలకు చేరుకుంది. వాటిని పోలింగ్ కేంద్రాల వారిగా ప్యాకింగ్ చేసి పోలింగ్ కేంద్రాలకు తరలించారు. అయితే హైకోర్టు నిర్ణయంతో ఇప్పుడు పంపిణీ కేంద్రాలకు తరలించిన సామగ్రిని వెనక్కు తీసుకెళ్తున్నారు. వాటిని గోదాముల్లో ఉంచనున్నట్లు అధికారులు వివరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు.
ఇదీ చదవండి: