గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో బాల కార్మికుల నివారణ కోసం అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నాలుగు బృందాలుగా ఏర్పడి పలు ప్రాంతాల్లో బాల కార్మికులుగా పనిచేస్తున్న ఎనిమిది మందిని గుర్తించారు. జిల్లా సహాయ కార్మిక శాఖ కమిషనర్ ఎన్.ఆదినారాయణ ఆధ్వర్యంలో ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
అనంతరం బాలకార్మికుల తల్లిదండ్రులను పిలిపించిన అధికారులు.. వారిని మరల పనుల్లో పెట్టకుండా ఉండేలా అధికారులు హెచ్చరించారు. బాలలను కూలీ పనిలో పెట్టుకున్న యజమానులతో పాటు పంపించిన తల్లిదండ్రులపైనా కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో మండల విద్యాశాఖ అధికారి మల్లికార్జున శర్మ, ఐసీడీఎస్ అధికారి పద్మజారాణి బాలకార్మిక నిర్మూలన వ్యవస్థ అధికారులు పునరావాస కేంద్రం పెద్దలు హాజరయ్యారు.
ఇదీ చదవండి: