earth quake in Guntur : గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. శావల్యాపురం, నూజెండ్ల మండలాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. శావల్యాపురం మండలం బొందిలిపాలెం, మతుకుమల్లిలో.. నూజెండ్ల మండలం ములకలూరులో రెండు, మూడు సెకన్లపాటు భూమి కంపించింది. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఇదీ చదవండి: earthquake: విశాఖలో పలుచోట్ల భూప్రకంపనలు