అత్తింటి వారు వరకట్నం కోసం వేధింపులకు గురి చేయటంతో శ్రావణి అనే వివాహిత బలవర్మరణానికి పాల్పడింది. ఈ ఘటనకు కారణమైన భర్త, అతని కుటుంబసభ్యులను అరెస్ట్ చేసినట్లు గుంటూరు పశ్చిమ డీఎస్పీ సుప్రజ తెలిపారు.
ఏం జరిగింది?
గుంటూరు రాజీవ్‌గాంధీ నగర్‌కి చెందిన పసుపులేటి శివప్రసాద్‌తో శ్రావణి అనే మహిళకు 2016లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో శ్రావణి తల్లిదండ్రులు రెండు లక్షల రూపాయలు, బంగారపు ఉంగరం ఇతర లాంఛనాలు శివప్రసాద్‌కి కట్నంగా ఇచ్చారు. భర్త, అత్త, మామ అదనపు కట్నం కావాలని శ్రావణిని మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. కూతురి కాపురం బాగుండాలని శ్రావణి తల్లిదండ్రులు మరో రెండుసార్లు రూ.40వేలు చొప్పున శివప్రసాద్‌కి ఇచ్చారు. అయినా వేధింపులు ఆపని కారణంగా మనోవేదనకు గురైన శ్రావణి.. ఈ నెల 23న తన ఇంటిలోనే చీరతో ఉరి వేసుకుని మరణించింది.
మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టినట్లు అరండల్ పేట పోలీసులు తెలిపారు. శ్రావణి చావుకు కారణమైన భర్త శివ ప్రసాద్, అతని తల్లి ఆది లక్ష్మి, కుటుంబసభ్యురాలు నాగమణిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ సుప్రజ వివరించారు.
ఇదీ చదవండి: