ETV Bharat / state

నమ్మిన యజమానికి కుచ్చుటోపీ.. రూ.7కోట్ల విలువైన నగలతో జంప్​ - crime updates in ap

DRIVER ESCAPED WITH GOLD : చాలా మందికి పెద్ద మొత్తంలో డబ్బు, నగలు చూస్తే ఆశపుడుతుంది. కొద్ది మంది ఆశతో సరిపెట్టుకుంటే.. మరి కొంతమంది వాటిని కొట్టేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ కూడా ఓ వ్యక్తి నగలు మీద వ్యామోహంతో వాటిని కొట్టేయాలనుకున్నాడు. దీంతో సరిగ్గా సమయం చూసి అందిన కాడికి దోచుకుని ఉడాయించి.. నమ్మిన యజమానిని నట్టేట ముంచాడు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

DRIVER ESCAPED WITH GOLD IN HYDERABAD
DRIVER ESCAPED WITH GOLD IN HYDERABAD
author img

By

Published : Feb 18, 2023, 1:38 PM IST

DRIVER ESCAPED WITH GOLD IN HYDERABAD : యజమాని వద్ద నమ్మకంగా ఉంటూనే ఏకంగా ఏడు కోట్ల రూపాయల విలువైన బంగారంతో ఉడాయించి టోకరా పెట్టాడు ఓ కారు డ్రైవర్‌. ఈ ఘటన తెలంగాణ హైదరాబాద్​లోని ఎస్సార్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌లోని మైహోమ్ భోజా అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న రాధిక అనే మహిళ నగల వ్యాపారం చేస్తోంది.

వజ్రాభరణాలు అవసరమైన వారికి ప్రముఖ నగల దుకాణాల నుంచి కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నారు. ఆమె వద్ద శ్రీనివాస్‌ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. నమ్మకంగా మెలగడంతో అప్పుడప్పుడు కస్టమర్లు ఇచ్చే ఆర్డర్లను అతడికి ఇచ్చి పంపించేవారు. అయితే ఆభరణాలపై కన్నేసిన శ్రీనివాస్.. అందుకు తగిన పథకాన్ని సిద్ధం చేసుకుని సమయం కోసం ఎదురుచూశాడు. అనుకున్నట్లుగానే శ్రీనివాస్​ కోరుకున్న టైం వచ్చింది.

అదే అపార్ట్‌మెంట్స్‌లో ఉండే అనూష అనే కస్టమర్‌ రూ.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు కావాలని రాధికను సంప్రదించి ఆర్డర్​ ఇచ్చారు. తీరా ఆర్డర్​ చేసిన నగలను డెలివరీ చేసే సమయానికి తాను ఇంట్లో లేనని.. మధురానగర్‌లో ఉన్న తన చుట్టాల ఇంట్లో ఉన్నట్లు చెప్పి.. నగలను అక్కడికే పంపాలని కోరారు. దీంతో రాధిక.. డ్రైవర్‌ శ్రీనివాస్‌, సేల్స్‌మెన్‌ అక్షయ్‌లతో మొత్తం రూ.7 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను పంపించారు. వాటిలో రూ.50 లక్షల విలువ గల నగలు అనూషవి అయితే.. మిగిలినవి సిరిగిరిరాజ్‌ జెమ్స్‌ అండ్‌ జువెల్లర్స్‌కి ఇవ్వాల్సి ఉంది.

యజమాని చెప్పినట్లుగానే మధురానగర్‌లోని అనూష బంధువుల ఇంటికి ఆ ఇద్దరూ చేరుకున్నారు. ఇక్కడే శ్రీనివాస్​ తన పథకాన్ని అమలు చేయాలని అనుకున్నాడు. ఆ క్రమంలోనే ముందుగా వేసుకున్న ప్లాన్‌ ప్రకారం తాను కారులోనే ఉండి.. ఆర్డర్‌ అనూషకు ఇవ్వడానికి అక్షయ్‌ను ఇంట్లోకి పంపాడు. అతడు కస్టమర్‌కు నగలు ఇచ్చి వచ్చేలోగా వాహనంతో సహా అక్కడి నుంచి శ్రీనివాస్​ పరారయ్యాడు. కారు లేదని గమనించిన అక్షయ్.. .యజమానికి సమాచారం అందించారు.

సేల్స్​మెన్​ ద్వారా విషయం తెలుసుకున్న యజమాని వెంటనే ఎస్సార్‌నగర్‌ పోలీసులకు కంప్లైంట్​ చేశారు. రాధిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అయితే డ్రైవర్ ఎత్తుకెళ్లిన నగల విలువ దాదాపు రూ.7 కోట్లు ఉంటుందని పోలీసులకు బాధితురాలు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.