ETV Bharat / state

Diwali celebrations: ఇంటింటా దీపాల కాంతులు.. అంబరాన్నంటిన సంబరాలు - ఏపీ తాజా వార్తలు

Diwali celebrations: వెలుగుల పండుగ దీపావళిని రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. దీపాలతో ఇళ్లను అందంగా అలంకరించి లక్ష్మీదేవికి పూజలు చేశారు. బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుని ఆనందం పంచుకున్నారు.

Diwali celebrations in ap
ఏపీలో ఘనంగా దీపావళి వేడుకలు
author img

By

Published : Oct 25, 2022, 8:12 AM IST

రాష్ట్రంలో ఘనంగా దీపావళి వేడుకలు

Diwali celebrations: దీపావళిని రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కొవిడ్ కారణంగా రెండేళ్లపాటు సరిగా జరపుకోలేక పోయిన జనం.. ఈసారి అంబరాన్నంటేలా సంబరాలు చేసుకున్నారు. విజయవాడలోని అపార్ట్‌మెంట్ వాసులు.. ఆనందోత్సాహాల మధ్య దీపావళి జరుపుకున్నారు. లక్ష్మీదేవి పూజ జరుపుకొని అనంతరం బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. నగరం బాణసంచా పేలుళ్లతో మార్మోగింది. చిన్నాపెద్దా సంతోషంగా వేడుకల్లో పాల్గొన్నారు.

గుంటూరులో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. అపార్ట్‌మెంట్ల ముందు, రహదార్లు, దుకాణాల వద్ద టపాసులు పేలుస్తూ చిన్నాపెద్దా కేరింతలు కొట్టారు. గుంటూరు నగరమంతా దీపాల వెలుతురులో మెరిసిపోయింది. కమ్మజన సేవాసమితి హాస్టల్‌లో విద్యార్థినులు.. టపాసులు కాల్చి దీపావళి సంబరాలు చేసుకున్నారు. నగరంలో.. ఇళ్ల ముందు దీపాలు వెలిగించి.. మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.

బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడిలో.. దీపావళి పండుగ, నరకాసుర వధ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రజలందరూ గ్రామంలోని ప్రధాన కూడలి వద్దకు చేరి రంగవల్లులు, దీపాలతో అలంకరించారు. బాణసంచా కాలుస్తూ నరకాసురుడి బొమ్మను దహనం చేశారు. అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దీపావళి మహా పర్వదినం వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. రాజమహేంద్రవరం, కాకినాడ, రామచంద్రాపురం, మండపేట, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, తుని ప్రాంతాల్లో పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు . ఆబాలగోపాలం బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. వివిధ రకాల దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి పూజలు నిర్వహించారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంలో ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు ఇంటి వద్ద దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద నరకాసురుడి బొమ్మను దహనం చేసి సంబరాలు జరుపుకున్నారు. గ్రామాల్లో ప్రజలు.. బాణాసంచా కాల్చి వేడుకలు చేసుకున్నారు.

విశాఖలో దీపావళి ఘనంగా జరుపుకున్నారు. బహుళ అంతస్తుల భవనాల వద్ద తిరునాళ్లను తలపించేలా బాణసంచా మోత మోగింది. మహిళలు.. లక్ష్మీపూజ నిర్వహించి.. టపాసులు కాల్చారు. నగరం దీపాల వెలుగుతో కాంతులీనింది. సామూహికంగా పండుగ జరుపుకోవడం చాలా ఆనందాన్నిచ్చిందని పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

నెల్లూరు జిల్లాలో దీపావళి పండుగను వైభవంగా నిర్వహించారు. మహిళలు దీపాలు వెలిగించి.. పూజలు చేశారు. చిన్నారులు, యువత.. టపాసులు, తారాజువ్వలు, చిచ్చుబుడ్లు వెలిగించి ఆనందాలు పంచుకున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా.. ఒంగోలులో ప్రతి ఒక్కరూ దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకున్నారు. అన్ని రకాల టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. దీపాలు, టపాసుల కాంతులతో నగరం వెలిగిపోయింది. పార్వతీపురంలో రాజకీయ నాయకులు, పట్టణ ప్రజలు బాణాసంచా కాలుస్తూ.. దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. వాడవాడలా దీపాల కాంతులు ఆకట్టుకున్నాయి. కుటుంబసమేతంగా బాణాసంచా కాల్చారు. మిఠాయిలు పంచిపెట్టి.. ఆనందం పంచుకున్నారు.

దీపావళిని పురస్కరించుకుని.. ఇంద్రకీలాద్రిపై ధనలక్ష్మీ పూజ.. శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవస్థానం ఈవో, ఇతర అధికారులు పూజలో పాల్గొన్నారు. ప్రధాన ఆలయం, ఉపాలయాలకు.. దీప ప్రజ్వలన చేసి.. పంచహారతుల సేవ నిర్వహించారు. విశాఖ సింహాచలం సింహగిరిపై.. నరకాసుర వధను వైభవంగా నిర్వహించారు. స్వామివారికి విశేష పూజలు నిర్వహించి.. అనంతరం నరకాసుర వధ కార్యక్రమం చేపట్టారు. శారదాపీఠంలో దీపావళిని ఘనంగా నిర్వహించారు. పీఠాధిపతులు.. స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర.. వేద విద్యార్థులతో కలిసి.. వేడుకల్లో పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.