దేశవ్యాప్తంగా బర్డ్‌ప్లూ కలకలం రేగటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు బర్డ్‌ప్లూ ఆనవాళ్లు కనిపించకపోయినా... అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు వివరించారు. పురుగుమందు కలిపిన గింజలు తినడం వల్లే ఇటీవల గుదిబండివారిపాలెంలో పెద్దసంఖ్యలో కాకులు చనిపోయాయన్నారు. వాటి శరీర భాగాలను బోపాల్‌లోని ప్రయోగశాలకు పంపామని తెలిపారు.
జిల్లాలోని కోళ్లఫారాల వద్ద ఎలాంటి వ్యాధి లక్షణాలు బయటపడలేదని తెలిపారు. ఉప్పలపాడులోని విదేశీ పక్షుల సంరక్షణ కేంద్రంలోనూ బర్డ్‌ప్లూ జాడ లేదని అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు.
ఇదీచదవండి: రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదు: డాక్టర్.అమరేంద్రకుమార్