తాడేపల్లి అత్యాచార ఘటన(Tadepalli rape Incident) ను సవాల్ గా తీసుకున్నామని.. త్వరలోనే నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ(DIG trivikram varma) అన్నారు. ఈ ఘటనపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టమన్నారు. ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. గుంటూరు నగరంలో అమలవుతున్న కర్ఫ్యూ(curfew)ను ఇవాళ పరిశీలించారు. ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు కర్ఫ్యూను పకడ్బందీగా ఆమలు చేస్తున్నామన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలతో పాటు వాహనాలను జప్తు(seize) చేస్తామన్నారు.
మరోవైపు అత్యాచారానికి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రైల్వే ట్రాక్ వద్ద ప్రధాన నిందితుడు కనిపించాడన్న వార్తలతో గాలింపు(searching) ను ముమ్మరం చేశారు. కరకట్ట, రైల్వే ట్రాక్ వద్ద అణువణువూ గాలిస్తున్నారు. రాత్రి సమయాల్లోనూ గస్తీ కాస్తున్నారు.
ఇదీచదవండి.