ETV Bharat / state

సంగం డెయిరీ నూతన ఉత్పత్తులు.. ఆవిష్కరించిన ధూళిపాళ్ల - sangam dairy latest news

సంగం డెయిరీ నూతన ఉత్పత్తులను డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర ఆవిష్కరించారు. పాడి రైతుల కోసం సంఘం డెయిరీ అహర్నిశలూ కృష్టి చేస్తోందన్న ఆయన.. మధ్య తరగతి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని వారికి అవసరమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నామని తెలిపారు.

dhulipalla innovate new products of sangam dairy

author img

By

Published : Oct 16, 2021, 9:02 AM IST

మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని వారికి అవసరమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నామని సంఘం డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీ ఆవరణలో దసరా పండుగ వేళ.. డెయిరీ నూతన ఉత్పత్తులను ఆవిష్కరించారు.

ఈ ఉత్పత్తుల్లో.. ఉస్మానియా సాల్టెడ్‌ బిస్కట్లు, ఫ్లమ్‌ కేక్‌, ఎగ్‌లెస్‌ కేక్‌, హాయ్‌ అరోమా నెయ్యి 30, 50 గ్రాముల ప్యాకింగ్‌, 5 లీటర్ల ఆవునెయ్యి, గేదె నెయ్యి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ... పాడి రైతుల మేలుకోసం సంఘం డెయిరీ అహర్నిశలూ కృషి చేస్తోందన్నారు. అనంతరం.. గడ్డికోసే యంత్రాలకు పూజచేసి, వాటిని ప్రారంభించి రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్‌ డైరెక్టర్‌ గోపాలకృష్ణ, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: CM Jagan : ఉద్యోగుల ఉచిత గృహ వసతి సౌకర్యం... పొడిగింపునకు సీఎం అంగీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.