మంచి సమాజాన్ని, పౌరులను తయారు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కిలో విజ్ఞాన్ విహార్ సంస్థ పునశ్చరణ తరగతులను డీజీపీ ప్రారంభించారు. ఉపాధ్యాయుడు లేకుండా మంచి సమాజాన్ని ఊహించలేమని డీజీపీ అన్నారు. విద్యార్థులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులే పిల్లల్ని అర్థం చేసుకుంటారని చెప్పారు. విద్యార్థులు సైతం అదే భావనతో ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు.
ఇదీ చదవండి: స్థల వివాదం.. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ