ETV Bharat / state

జగన్ కనుసన్నల్లో ఉండవల్లి, కేవీపీ: మంత్రి దేవినేని - tdp

పోలవరం పనులు వేగవంతం చేయడానికే సీఎం క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమ తెలిపారు. 70 శాతానికి పైగా పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని అన్నారు. భద్రాచలం మునిగిపోతుందని కేసీఆర్ కేసులు వేస్తున్నారని... ఆయనిచ్చే కాసుల కోసం జగన్ నోరు విప్పబోరని మంత్రి దేవినేని ఆరోపించారు. జగన్ కనుసన్నల్లో ఉండవల్లి, కేవీపీ నాటకాలాడుతున్నారని దేవినేని దుయ్యబట్టారు.

devi
author img

By

Published : May 8, 2019, 10:20 AM IST

జగన్ కనుసన్నల్లో ఉండవల్లి, కేవీపీ: మంత్రి దేవినేని

పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి దేవినేని తెలిపారు. సుమారు 500 మంది ఇంజినీర్లు డ్యామ్‌ సైట్‌లో పనిచేస్తున్నారన్నారు. కొన్ని వందలమంది కార్మికులు నిత్యం పనిచేస్తున్నారని.. నిపుణులు, ఇంజినీర్ల సమక్షంలో పనులు సాగుతున్నాయని వివరించారు. ఎగువ, దిగువ కాపర్ డ్యామ్‌ నిర్మాణాలు వేగవంతం చేయాలని సీఎం సూచించారని పేర్కొన్నారు.

భద్రాచలం మునిగిపోతుందని కేసీఆర్ కేసులు వేస్తున్నారని... ఆయన ఇచ్చే కాసుల కోసం జగన్ నోరు విప్పబోరని మంత్రి దేవినేని ఆరోపించారు. వైఎస్ హయాంలో లబ్ధిపొందిన వారంతా అక్కడ తెరాసలో, ఇక్కడ వైకాపాలో చేరారన్నారు. ప్రమాణస్వీకారం చేయాలంటే 7 ముంపు మండలాలు కలపాలని సీఎం పట్టుబట్టారన్న దేవినేని... ఆలయాలు మునిగిపోతాయని చెబుతున్న కేసీఆర్ ఆనాడు ఏంచేశారని ప్రశ్నించారు. పోలవరానికి నిధులు సమకూరకుండా అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కవిత పోలవరానికి వ్యతిరేకంగా పిటిషన్లు వేసినప్పుడు కేవీపీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాజమహేంద్రవరం కొట్టుకుపోతుందని కొంతమంది అసత్యాలు చెబుతున్నారని... వైకాపాపై ప్రేమ ఉంటే ఆ పార్టీలో చేరండిగానీ... ప్రజలను పక్కదారి పట్టించొద్దని సూచించారు. జగన్‌కు లబ్ధి చేకూర్చడానికి కేవీపీ శతవిధాలా ప్రయత్నించారన్నారు.

పోలవరం పవర్ ప్రాజెక్టు పనులు చేపట్టాలని ప్రయత్నించారని... ఆ దుర్బుద్ధి కారణంగా పోలవరం పనులు రెండేళ్లకుపైగా ఆగిపోయాయని మండిపడ్డారు. జగన్ కనుసన్నల్లో ఉండవల్లి, కేవీపీ నాటకాలాడుతున్నారని దేవినేని దుయ్యబట్టారు.

Intro:AP_TPG_06_06_TEMPLE_KULCHIVETHA_ANDOLANA_AVB_C2
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
(  ) పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని అంబికా థియేటర్ సమీపంలో శ్రీ ఆంజనేయ స్వామి మందిరాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి

Body:ఆంజనేయస్వామి మందిరాన్ని ప్రో క్లీనర్ తో కూల్చివేయడం తో పాటు మందిరం లో గల సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలను సైతం ముక్కలు చేసి బయటపడ్డారు సమాచారం అందుకున్న బజరంగ్ దళ్ విశ్వ హిందు పరిషత్ నాయకులు కార్యకర్తలు స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ఆగ్రహానికి లోనైన కార్యకర్తలు మంత్రాన్ని ధ్వంసానికి ఉపయోగించిన జెసిబి వాహన అద్దాలను రాళ్లతో కొట్టారు . కూలగొట్టిన మందిరాన్ని తక్షణమే పునర్నిర్మించాలని నాయకులు డిమాండ్ చేశారు స్థానికంగా ఉన్న స్థలాన్ని సంబంధించిన వారు ఈ సంఘటనకు బాధ్యులు అంటూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సంఘటనకు కారకులైన వారిని తక్షణమే అరెస్టు చేయాలని ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు

Conclusion:సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నం చేశారు. నాయకులకు సర్ది చెప్పి దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
బైట్. వంశీకృష్ణ , వీహెచ్పి నాయకుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.