ETV Bharat / state

నా తండ్రి కల సాకారం అవుతుంది : ఉపసభాపతి కోన రఘుపతి

కొత్త జిల్లాల ఏర్పాటులో బాపట్ల కేంద్రంగా జిల్లా ఏర్పడుతుందని శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి అభిప్రాయపడ్డారు. గురువారం పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బాపట్లను అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తానన్నారు.

నా తండ్రి కల సాకారం అవుతుంది : ఉపసభాపతి కోన రఘుపతి
author img

By

Published : Jun 21, 2019, 6:45 AM IST

నా తండ్రి కల సాకారం అవుతుంది : ఉపసభాపతి కోన రఘుపతి
బాపట్ల కేంద్రంగా జిల్లా ఏర్పడుతుందని శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో గురువారం ఏర్పాటుచేసిన పౌర సన్మాన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, ఉపసభాపతి కోన రఘుపతి, శాసన మండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కోన రఘుపతి మాట్లాడుతూ బాపట్ల పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడతామని పేర్కొన్నారు. తన తండ్రి కోన ప్రభాకరరావు మూడు పర్యాయాలు బాపట్ల శాసనసభ్యుడిగా పనిచేశారని..బాపట్ల అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు. బాపట్లను నల్లమడ జిల్లాగా మార్చాలని తన తండ్రి ఎంతో కాలం ప్రయత్నించారన్న ఉపసభాపతి..ఆ కోరిక ఇప్పుడు నెరవేరుతుందన్నారు. జిల్లా కేంద్రంగా బాపట్లను అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని కోన తెలియజేశారు.

ఇదీ చదవండి : ప్రధానితో నలుగురి భేటీకి ముహూర్తం ఖరారు

Intro:ప్రజా సంక్షేమమే జగనన్న ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , అబ్కారీ శాఖ, వాణిజ్య పన్నుల శాఖ మాత్యులు నారాయణస్వామి తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి మొదటిసారిగా జిల్లాకు వచ్చి నియోజకవర్గంలో కార్వేటినగరం, వెదురుకుప్పం, పెనుమూరు మండలాల్లో విస్తృత పర్యటనలు జరిపారు. నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి నారాయణస్వామికి కార్యకర్తలు , నాయకులు అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు.

Body:గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యపానాన్ని అంచెలంచెలుగా నిషేధిస్తామని, పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన మానిఫెస్టోను పూర్తిస్థాయిలో లో అమలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని అన్నారు .

Conclusion:ప్రజలు తమ పార్టీపై ఉంచిన నమ్మకాన్ని కానీయకుండా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి తగిన చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. మహేంద్ర etv bharat జీడి నెల్లూరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.