గుంటూరు జిల్లా నకరికల్లు మండలం అడ్డరోడ్డులోని గుంటూరు బ్రాంచ్ కెనాల్లో ప్రమాదవశాత్తు పడి ఓ అధికారి గల్లంతయ్యారు. రొంపిచర్ల మండలం ఎడ్వర్టు పేటకు చెందిన కొలగాని ఏడుకొండలు.. ప్రస్తుతం ప్రకాశం జిల్లా చదలవాడలోని సీబీఎఫ్లో పశుసంవర్ధకశాఖ ఏడీఏగా పనిచేస్తున్నారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో ఏడుకొండలు ప్రమాదవశాత్తు గుంటూరు బ్రాంచ్ కెనాల్లో పడిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న నకరికల్లు పోలీసులు.. స్థానికుల సహాయంతో గాలింపు చేపట్టగా.. అతనికి చెందిన ద్విచక్ర వాహనం, ఓ టవాలు మాత్రమే దొరికాయి. ఏడుకొండలు కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.
ఇదీచూడండి: