ETV Bharat / state

అంధత్వ నివారణే .... వైయస్​ఆర్ కంటివెలుగు ధ్యేయం ! - అంధత్వ నివారణయే .... వైయస్​ఆర్ కంటివెలుగు ధ్యేయం

సచివాలయంలోని మొదటిబ్లాక్​ సమావేశ మందిరంలో కంటి వెలుగు కార్యక్రమంపై సంబంధిత అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్ష నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం
author img

By

Published : Oct 25, 2019, 6:49 AM IST

అంధత్వ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం సత్ఫలితాలను ఇస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. సచివాలయంలోని మొదటిబ్లాక్​లోని సమావేశ మందిరంలో కంటి వెలుగు కార్యక్రమంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జనాభాలో 40 శాతం మందిలో కంటి సమస్యలు సాధారణమని ఆయన పేర్కొన్నారు. 80 శాతం అంధత్వం నివారించదగినదని తెలిపారు. అంధత్వాన్ని 1 శాతం నుంచి 0.3 శాతానికి తగ్గించగలిగామన్నారు. ఈ పథకం ద్వారా 5.30 కోట్ల మందికి కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఉచితంగా కంటికి శస్త్రచికిత్సలు చేసి కళ్లజోళ్లు అందించామన్నారు. చిన్నపిల్లలు సాధారణంగా కాటరాక్ట్, తట్టు, రూబెల్లా, విటమిన్ వంటి ఏదో ఒక లోపంతో బాధపడుతుంటారని తెలిపారు. వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం 560 కోట్లు ఖర్చు చేస్తోందని సీఎస్ అన్నారు. రాష్ట్రంలోని 5.30 కోట్ల మందికి నేత్ర పరీక్షలతోపాటు అవసరమైన చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా అందించనుందన్నారు. తొలి విడతలో భాగంగా అక్టోబర్ నెల 10 నుంచి 16 వరకు మొత్తం 60 వేల 693 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని సుమారు 70 లక్షలమంది విద్యార్థులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించామని అధికారులు సీఎస్​కు వివరించారు. ఇప్పటికే 62 లక్షల 81 వేల 251 మంది చిన్నారుల డేటా.. ఆన్ లైన్​లో అప్​లోడ్ చేశామని ఈ సందర్భంగా అధికారులు వివరించారు.

కంటి వెలుగు కార్యక్రమంపై అధికారులతో సీఎస్ సమీక్ష

ఇవీ చదవండి

కంటివెలుగు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి:ఎమ్మెల్యే మేకపాటి

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.