ఇదీ చూడండి:
ఇళ్ల స్థలాల కోసం రైతుల భూములు చదును చేస్తున్న సీఆర్డీఏ - రాజధాని తాజా న్యూస్
రాజధానిలో పేదల కోసం ఇచ్చే ఇళ్ల స్థలాలను సీఆర్డీఏ అధికారులు చదును చేస్తున్నారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో రైతులు ఇచ్చిన 164 ఎకరాలను పేదలకు కేటాయించనున్నారు. అయితే రైతులు అడ్డుకుంటారన్న సమాచారంతో ఎర్రబాలెంలో పోలీసులు భారీగా మోహరించారు. సీఆర్డీఏ అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ భూములను పండగ వాతావరణంలో సీఆర్డీఏకి ఇచ్చామని అదే సంస్థ దొంగచాటుగా వచ్చి వాటిని తీసుకుంటుందని వాపోయారు.
రైతుల స్థలాలను చదును చేస్తున్న సీఆర్డీఏ అధికారులు