ETV Bharat / state

మరిన్ని ఐసోలేషన్ కేంద్రాలు అవసరం: సీపీఎం

author img

By

Published : May 13, 2021, 9:35 PM IST

గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్లలో ఈ నెల 3న ప్రారంభించిన పుటుంబాకా వెంకటపతి కొవిడ్ ఐసోలేషన్ కేంద్రంలోని ఏర్పాట్లను పరిశీలించిన సీపీఎం నేతలు... సంతృప్తి వ్యక్తం చేశారు.

ఐసోలేషన్ సెంటర్ సందర్శించిన సీపీఎం మధు
ఐసోలేషన్ సెంటర్ సందర్శించిన సీపీఎం మధు

పిడుగురాళ్లలో ఈ నెల 3న పుటుంబాకా వెంకటపతి కొవిడ్ ఐసోలేషన్ కేంద్రం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ కేంద్రాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు సందర్శించారు. 30 మందితో నడిపే ఈ సెంటర్ నుంచి ఇప్పటికే 16 మంది డిశ్చార్జ్ కావటం అభినందనీయమన్నారు. పల్నాడు హాస్పిటల్ డాక్టర్ అశోక్ కుమార్ ను సీపీఎం నేతలు అభినందించారు.

కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ఇలాంటి ఐసోలేటెడ్ కేంద్రాలు అవసరమని.. తమ కార్యకర్తలు సేవా దృక్పథంతో పనిచేస్తున్నారని చెప్పారు. పల్నాడు ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కేంద్ర నిర్వహణకు దాతలు స్పందించి విరాళం ఇస్తున్నారని చెప్పారు. వారిని అభినందించారు. కొవిడ్ వ్యాప్తి ఉన్నంతవరకు సెంటర్ కొనసాగిస్తామని నిర్వాహకులు చెప్పారు.

ఇవీ చూడండి:

గుంటూరు జీజీహెచ్‌కు రోగుల తాకిడి.. పడకల కోసం నిరీక్షణ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.