గుంటూరులోని అడవి తక్కెలపాడు, మంగళగిరిలో నిర్మాణం పూర్తై ఖాళీగా ఉన్న ఇళ్లను.. ప్రజా సంఘాలతో కలిసి సీపీఎం నేత సి.హెచ్ బాబురావు పరిశీలించారు. ఆ ఇళ్లను తక్షణం పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా పంపిణీ చేయకపోతే ఈ నెల 21న ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పిచ్చి మొక్కలతో నిండిన ఇళ్లు, రక్షణ లేక తలుపులు, వస్తువులు అదృశ్యం కావడం వంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. దెబ్బతింటున్న గృహాలు అసాంఘిక కార్యక్రమాలకు నెలవుగా మారుతున్నాయని చెప్పారు.
ఇదీ చదవండి:
జిల్లాలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే 155 కేసులు