ETV Bharat / state

CPM PROTEST: ఎమ్మెల్యే అంబటి రాంబాబును అడ్డుకున్న సీపీఎం నేతలు

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబును సీపీఎం నాయకులు అడ్డుకున్నారు. చెత్తుపన్నును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన సమావేశానికి అడ్డుతగలడం సరైనా పద్దతి కాదని సీపీఎం నేతలకు తెలిపారు.

సీపీఎం నేతలతో మాట్లాడుతున్న అంబటి రాంబాబు

author img

By

Published : Jul 30, 2021, 3:43 PM IST

చెత్తపై పన్ను రద్దు చేయాలంటూ వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబును సత్తెనపల్లి పురపాలక కార్యలయంలో సీపీఎం నాయకులు అడ్డుకున్నారు. పురపాలక కౌన్సిల్‌ అత్యవసర సమావేశానికి వెళ్తున్న ఎమ్మెల్యేను అడ్డుకోవడంతో వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయం బయట నిరసన తెలుపుకోవచ్చని ఇలా లోపలికి రావడం తగదన్నారు.

చెత్తపై పన్ను నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని ఆయన వారికి వివరించారు. మెట్లపై అడ్డుగా కుర్చున్న సీపీఎం నాయకులు చెత్త పన్నుపై కౌన్సిల్‌లో తీర్మానం చేయడానికి వీల్లేదంటూ ఆందోళనకు దిగారు. వారిని దాటుకుంటూ ఎమ్మెల్యే లోపలికి వెళ్లారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు.

ఇదీ చదవండి:

current shock: గుంటూరు జిల్లాలో ఆరుగురు అనుమానాస్పద మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.