CPI Ramakrishna Fire on CM Jagan: ఐదు కోట్ల మంది ప్రజలతో ముడిపడి ఉన్న జిల్లాల విభజన అంశాన్ని... రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా ఎందుకు చేపడుతుందో వెల్లడించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కొత్త జిల్లాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలతోనూ చర్చించకపోవటం దారుణమని అన్నారు. గుంటూరు సీపీఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన ఆయన..జిల్లాల పునర్వ్యవస్థీకరణ నిర్ణయాన్ని సీఎం జగన్ ఏకపక్షంగా తీసుకున్నారని దుయ్యబట్టారు. సున్నితమైన అంశంపై ఆన్లైన్లో హడావుడిగా మంత్రుల ఆమోదం తీసుకోవటమేంటని ప్రశ్నించారు.
సీఎంకు మంత్రులపై విశ్వాసం లేదు..
మంత్రులపైనా సీఎం జగన్కు విశ్వాసం లేదనే విషయం అర్థమైపోయిందని రామకృష్ణ ఎద్దేవా చేశారు. రివర్స్ పీఆర్సీ దెబ్బకు ఉద్యోగులు పాత జీతాలే కోరుతున్నారన్న ఆయన.. అశుతోశ్ కమిటీ నివేదికను ఎందుకు బయటపెట్టటం లేదని నిలదీశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్తగా పరిశ్రమలు, ఉద్యోగాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధం కావాలని రామకృష్ణ సవాల్ విసిరారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: Janasena party Protest: 'విజయవాడ జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలి'