రాజధాని అమరావతిని తరలిస్తే మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని... సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన రాజధానిని అమరావతి నుంచి తరలిస్తామని కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రైతులు తమ భూములను రాజధాని కోసం ఇచ్చారా? ఇళ్ల స్థలాల కోసం ఇచ్చారో మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వామపక్ష పార్టీలను విమర్శించే నైతికహక్కు నానికి లేదని ధ్వజమెత్తారు.
ఇదీచదవండి.