అమరావతిలోనే రాజధాని కొనసాగించాలన్న సీపీఐ నేత రామకృష్ణ అసెంబ్లీ ఓ చోట, సెక్రటేరియట్ మరో చోట పెట్టడం సరైన నిర్ణయం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రభుత్వ వైఖరిని చూసి అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని.. ఇదే సమయంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని స్పష్టం చేశారు. దీనిపై సమగ్రంగా చర్చించి వారంలోగా నివేదిక రూపొందిస్తామని రామకృష్ణ తెలిపారు. కర్నూలో హైకోర్టు ఏర్పాటును అందరూ స్వాగతిస్తున్నారని అన్నారు. ఇదీ చదవండి:
వైకాపా ఆరోపణ నిజమే కావచ్చు...