పరిపాలనా వికేంద్రీకరణ కంటే అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాష్ట్ర రాజధానిగా భాషాప్రయుక్త రాష్ట్రాల విభజన సమయంలోనే వామపక్ష పార్టీలు స్పష్టంగా విజయవాడ రాజధానిగా ఉండాలని చెప్పాయని గుర్తు చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని... వెనకబడిన ప్రాంతాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి అమరావతిని రాజధానిగా ఆమోదించి ఇప్పుడు మాట మార్చడం సరైంది కాదన్నారు.
అసెంబ్లీ సమావేశాల స్థాయిని దిగజార్చిన జగన్ ప్రభుత్వం హుందాతనాన్ని మరచి రాజకీయ ఆరోపణలు, దూషణలతోనే సమయాన్ని వృథా చేశారని ఆరోపించారు. రాజధాని కమిటీ నివేదిక సమర్పించగానే రాజధాని అమరావతి ,రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నామన్నారు.
ఇవీ చదవండి