ఆత్మకూరులో ఇళ్ల కోల్పోయిన బాధితులను.. సీపీఐ నేతలు పరామర్శించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి గతంలో ఉండవల్లి, పెనుమాకలలో బాధితుల తరపున చేసిన పోరాటం మర్చిపోయారా....? అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రశ్నించారు. నాడు ఎమ్మెల్యేలు భూ నిర్వాసితులకు రెండు సెంట్ల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక.. ఆళ్ల రామకృష్ణారెడ్డి వాటిని మర్చిపోయారా అని నాగేశ్వరరావు ప్రశ్నించారు. న్యాయస్థానం ఉత్తర్వులను ధిక్కరించి.. ఇళ్లు కూల్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ.. తిరుపతి ఉపఎన్నికకు నేడు తెదేపా అభ్యర్థి నామినేషన్.. నెల్లూరుకు పార్టీ నేతలు