టిడ్కో గృహ సముదాయాల స్వాధీనానికి సీపీఐ, తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన తరుణంలో గుంటూరులో ఆ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడే ముందస్తు అరెస్టులు చేశారు. గుంటూరు వసంతరాయపురంలో మాజీమంత్రి నక్కా ఆనందబాబును గృహ నిర్బంధం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను తాడేపల్లిలో నిర్బంధం చేయగా... తుళ్లూరులో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావును అదుపులోకి తీసుకుని అమరావతి పోలీస్ స్టేషన్కు తరలించారు.
గుంటూరులో అడవి తక్కెళ్లపాడు టిడ్కో గృహ సముదాయానికి వెళ్లేందుకు ప్రయత్నించిన సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసరావుపేటలో తెదేపా ఇన్ఛార్జ్ చదలవాడ అరవిందబాబును, గుంటూరులో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావును గృహనిర్బంధం చేశారు. గుంటూరులో పరిస్థితిని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పరిశీలించారు. జేకేసీ కళాశాల కూడలిలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి ఎస్పీ సూచనలు ఇచ్చారు.
ఇవీ చదవండి:
'సీఎం జగన్ను ప్రశ్నించలేరు కానీ... చంద్రబాబును విమర్శిస్తారా'