సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావును తుళ్లూరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వామపక్షాల పిలువు మేరకు గుంటూరు జిల్లాలో టిడ్కో ఇళ్లను స్వాధీనం చేయించేందుకు వెళ్తున్న ఆయనను అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ లోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లబ్దిదారులకు వెంటనే గృహాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.
పట్టణాల్లో నిర్మించిన టిడ్కో ఇళ్లలో లబ్ధిదారులతో నేటి నుంచి సామూహిక గృహ ప్రవేశాలు చేయిస్తామని సీపీఐ పిలుపునిచ్చిన వేళ.. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు చేపడతామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇవీ చూడండి: