గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 523 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కోవిడ్ సంఖ్య 65వేల 526కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరంలోనే 119 ఉన్నాయి. మంగళగిరిలో 14, పెదకాకానిలో 18, సత్తెనపల్లిలో 13, దాచేపల్లిలో 13, దుర్గిలో 18, చిలకలూరిపేటలో 13, నరసరావుపేటలో 21, వినుకొండలో 18, అమర్తలూరులో 17, బాపట్లలో 23, చేబ్రోలులో 14, కొల్లూరులో 11, పొన్నూరులో 12, రేపల్లెలో 28, తెనాలిలో 14, వేమూరులో 13 కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బులిటెన్ విడుదల చేశారు. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో 147 కేసులు వచ్చాయని తెలిపారు. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 60వేల 67 మంది ఇంటికి చేరుకున్నారు. వైరస్ ప్రభావంతో ఇవాళ జిల్లాలో నలుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 602 కి చేరింది. రాష్ట్రంలో కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన జిల్లాల్లో గుంటూరు రెండో స్థానంలో ఉంది.
ఇదీ చూడండి.
విషాదం నింపిన వరదలు...రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు గల్లంతు