గుంటూరు జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. జిల్లాలో కొత్తగా 838 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 45వేల 055 పాజిటివ్ కేసులు నమోదు కాగా... కరోనా నుంచి కోలుకుని 34వేల 898మంది ఇంటికి చేరుకున్నారు. తాజాగా కోవిడ్ వైరస్ ప్రభావంతో ఇద్దరు మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 446కి చేరింది.
రాష్ట్రంలోనే అత్యధిక మరణాలు సంభవించిన జిల్లాల్లో గుంటూరు జిల్లా రెండవ స్థానంలో నిలిచింది. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 51 కేసులు నమోదయ్యాయి. ఇక మండల వారిగా నమోదైన కేసులు వివరాలు ఇలా ఉన్నాయి. నరసరావుపేట-143, వినుకొండ-66, చిలకలూరిపేట-64, బాపట్ల-58, మాచర్ల-52, గురజాల-41, మంగళగిరి-35, నాదెండ్ల-33, తెనాలి-32, అమృతలూరు-21, సత్తెనపల్లి-19, దుర్గి-17, పిడుగురాళ్ల-17, బెల్లంకొండ-16, పిట్టలవానిపాలెం-15, రొంపిచర్ల-11, శావల్యాపురం-11, పెదనందిపాడు-10, తాడేపల్లి-10 చొప్పున కేసులు నమోదయ్యాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: నేడు వైఎస్‌ఆర్ ఆసరా పథకం ప్రారంభం