ETV Bharat / state

వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగికి కరోనా

గుంటూరులో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు సైతం కొవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. తాజాగా వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో కరోనా కేసు నమోదైంది. తోటి ఉద్యోగులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

guntur district
వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలోని ఉద్యోగులకు కరోనా పరీక్షలు
author img

By

Published : Jul 11, 2020, 10:05 AM IST

గుంటూరులోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో కరోనా కలకలం సృష్టించింది. కార్యాలయంలో పనిచేసే ఉద్యోగికి, అతని భార్యకు పాజిటివ్​గా నిర్థారణ అయింది. నాలుగు రోజుల క్రితం సదరు ఉద్యోగికి కరోనా లక్షణాలు కనిపించాయి. అతన్ని హోం క్వారంటైన్​కు పంపించారు. కార్యాలయంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. అతను కలిసిన ఉద్యోగులను గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ కేసు రావటంతో కార్యాలయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండీ అంబేడ్కర్ గృహంపై దాడిని ఖండిస్తూ నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.