గుంటూరు జిల్లాలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్న కొత్తగా మరో మూడు కేసులు బయటపడ్డాయి. తాడేపల్లి, మాచర్లలో ఒక్కో కేసు పాజిటివ్‌గా నిర్దరణ కాగా.... వీవీఐటీ క్వారంటైన్ సెంటర్లో ఉన్న చెన్నై నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు.
నరసరావుపేట, గుంటూరులో కొత్త కేసులు నమోదు కానప్పటికీ తాజా కేసులతో జిల్లావ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 447కు పెరిగింది. గుంటూరులో ఇప్పటివరకు 182, నరసరావుపేటలో 190 కేసులు నమోదయ్యాయి. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య పెరుగుతున్నా.. జిల్లాలో కొత్త ప్రాంతాలకు కేసులు విస్తరించడం ఆందోళన రేకెత్తిస్తోంది.
ఇవీ చూడండి: