గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో కరోనా కేసులు పెరుగుతుండటంపై.. అధికారులు అప్రమత్తమయ్యారు. కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా... నేటి నుంచి అత్యవసర దుకాణాలు మినహా అన్ని రకాల దుకాణాలను ఉదయం 11 గంటలకే మూసివేయాలని స్థానిక ఎమ్మార్వో శ్రావణ్ కుమార్ ఆదేశించారు.
అనవసరంగా రోడ్లపైకి రాకూడదని, విధిగా మాస్కు ధరించాలని కోరారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామన్నారు. ఇప్పటి వరకు మండలంలో 90 కరోనా కేసులు నమోదు కాగా.. వైరస్‌తో ఒకరు చనిపోయినట్టు తెలిపారు. వారం రోజుల పాటు నియంత్రణ చర్యలు పటిష్ఠంగా అమలు చేస్తామన్నారు.
ఇదీ చదవండి: