గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామ వాలంటీర్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. అప్రమత్తమైన అధికారులు గ్రామంలో ముందస్తు చర్యలు చేపట్టారు. వైద్య శాఖ అధికారాలు, మున్సిపల్ అధికారులు గ్రామంలో పర్యటించారు. శానిటేషన్ పనులు, వాలంటీర్ కలసిన ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ వివరాలను సేకరిస్తున్నారు. అయితే వాలంటీర్ తన విధులలో భాగంగా బుధవారం బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు రోజులు క్రితం ఫించన్లు పంపిణీ, ఆరోగ్య శ్రీ కార్డులు అందచేయడానికి అతని పరిధిలోని స్థానికులను కలిసినట్లు సమాచారం.
గ్రామ వాలంటీర్‌కు కరోనా పాజిటివ్ - guntur district corona news
రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా గుంటూరు జిల్లా ఇనిమెట్లలోని ఓ వాలంటీర్‌కు కరోనా సోకింది. అప్రమత్తమైన అధికారులు వాలంటీర్ ఎక్కడెక్కడ విధులు నిర్వహించారో.. ఎవరెవరిని కలిశారో వివరాలు సేకరిస్తున్నారు.