ETV Bharat / state

కరోనాపై చిత్రకారుల కదనం

కరోనా వైరస్​పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తమ వంతు కృషి చేసేందుకు చిత్రకారులు ముందుకు వచ్చారు. వైరస్ ఎంత ప్రమాదకరమో తమ పెయింటింగ్స్ ద్వారా వివరిస్తూ, రహదారులపై చిత్రిస్తున్న చిత్రాలు ఆలోచింపజేస్తున్నాయి.

corona paintings on roads in guntur
కరోనాపై చిత్రకారుల కదనం
author img

By

Published : Apr 17, 2020, 2:15 PM IST

కరోనా వైరస్ ఎంత ప్రమాదకారో సామాన్య ప్రజలకు అర్థమయ్యేందుకు రహదారులపై చిత్రాలు వేస్తూ అవగాహన కల్పిస్తున్నారు గుంటూరు చిత్రకారులు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఎన్టీఆర్ కూడలి వద్ద కరోనా తీవ్రతను వివరిస్తూ పెయింటింగ్ వేశారు. భౌతిక దూరం పాటించకపోతే కరోనా రక్కసి మింగేస్తుందని స్ఫురించేలా వేసిన చిత్రం వైరస్ ప్రభావం కళ్లకు కట్టేలా ఉంది. మహమ్మారిని పారద్రోలేందుకు కృషి చేస్తున్న పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులకు చిత్రాల ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

లక్ష్మీనగర్ కూడలి వద్ద ఫోటోగ్రఫీ అనుబంధ కార్మికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 'ఇంట్లోనే ఉందాం... ప్రాణాలు కాపాడుకుందాం... కరోనాను తరిమి కొడదాం' అంటూ నినదిస్తూ ఉన్న చిత్రం ఆలోచింపజేస్తోంది.

లాక్​డౌన్ కారణంగా ఉపాధి లేకపోయినా, తమకు వచ్చిన కళ ద్వారా కరోనాపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు వివరించారు.

ఇదీ చదవండి: కరోనాపై గుంటూరు రమణ పాట... విన్నారా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.