గుంటూరు జిల్లా తెనాలిలో టౌన్ చర్చి ఎదురుగా ఉన్న ఒకే కుటుంబంలో సభ్యులందరికీ కరోనా సోకింది. అదే కుటుంబంలోని వృద్ధురాలు మినహా మిగిలిన వారందరూ గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే తెనాలిలో ఇంటి దగ్గర చికిత్స పొందుతున్న వృద్ధురాలు కొవిడ్‌తో మరణించింది. కుటుంబ సభ్యులకు విషయం తెలిసినా.. చివరి చూపు చూసే అవకాశం వారికి దక్కలేదు. వెంటనే సమాచారాన్ని అందుకున్న 'సత్యం-శివం-సుందరం' అనే స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు ముందుకొచ్చి ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
"కరోనా మహమ్మారి ఎంతోమందిని బలి తీసుకుంది. కరోనా భయంతో రోడ్లవెంట చనిపోయిన మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. పోలీసుల అనుమతితో చాలా మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేశాం. కరోనాతో చనిపోయిన వ్యక్తులను కడచూపునకు కుటుంబ సభ్యులు రాని సందర్భాల్లో చివరి తంతు మేమే పూర్తి చేస్తున్నాం" - స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు.
ఇదీ చదవండి: భర్త నడిపిన ఆటోనే జీవనాధారం.. ఆ మహిళ ఎందరికో స్పూర్తిదాయకం