గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేల మార్క్ దాటింది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో కొత్తగా 582 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో జిల్లా వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 51 వేల 50 కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 42 వేల 262 మంది ఇంటికి చేరుకున్నారు. తాజాగా వైరస్ ప్రభావంతో ఇద్దరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 494 కి చేరింది. రాష్ట్రంలోనే అత్యధిక మరణాలు నమోదైన జిల్లా గుంటూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది.
కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 141 కేసులు నమోదయ్యాయి. ఇక మండలాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. నరసరావుపేట-53, తెనాలి-46, బాపట్ల-45, మాచర్ల-31, తాడేపల్లి-29, గుంటూరు గ్రామీణ ప్రాంతం -28, పెదకాకాని-19, తాడికొండ-18, మంగళగిరి-18, సత్తెనపల్లి-10, వట్టిచెరుకూరు-10, నకరికల్లు-10 చొప్పున కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
ఇదీ చదవండి: