ETV Bharat / state

ప్రత్తిపాడులో యువకుడికి కరోనా.. 120 మందికి పరీక్షలు - ప్రత్తిపాడులో కరోనా కేసుల వార్తలు

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికి మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. 2 రోజులక్రితం ఓ యువకుడు వైరస్ లక్షణాలతో పరీక్షలు చేయించకోగా.. పాజిటివ్​ నిర్ధరణ అయ్యింది. ఇటీవల అతడు హోంమంత్రి, కలెక్టర్​లు హాజరైన ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. దీంతో అధికారులు 120 మందికి పరీక్షలు చేశారు.

corona cases in prattipadu guntur district
ప్రత్తిపాడులో కరోనా కేసులు
author img

By

Published : Jul 12, 2020, 11:49 AM IST

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఓ యువకుడికి వైరస్ లక్షణాలు కనిపించటంతో పరీక్షలు చేయించుకున్నాడు. అయితే ఫలితాలు రాకముందే అతను గ్రామంలో తిరిగాడు. హోంమంత్రి సుచరిత, కలెక్టర్ శామ్యూల్ పాల్గొన్న రైతు దినోత్సవ వేడుకలకు హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మంది వరకు పాల్గొన్నారు.

అక్కడ అతడు ప్రజాప్రతినిధులకు దగ్గరగా ఉన్నాడు. కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి.. ద్విచక్రవాహనంపై గ్రామంలో చక్కర్లు కొట్టాడు. తాజాగా అతని పరీక్ష ఫలితాలు రాగా.. పాజిటివ్​గా నిర్ధరణయ్యింది. దీంతో గ్రామం మొత్తం ఉలిక్కిపడింది. అధికారులు ఆ యువకుడితో కాంటాక్టులో ఉన్న 120 మందికి పరీక్షలు చేశారు. అతను తరచూ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తుంటాడు. దీంతో అధికార వర్గాల్లో ఆందోళన మొదలైంది.

ఇవీ చదవండి..

కరోనా బాధితులకు హోం క్వారంటైన్‌ కిట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.