గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. గురువారం జిల్లాలో 94 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,767కు చేరుకుంది. కొత్తగా వచ్చిన వాటిలో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 17 కేసులు ఉన్నాయి. బాలాజీ నగర్ 3, శ్రీనివాసరావు తోట 2, రాజీవ్ గాంధీ నగర్ , శ్రీనగర్ , బొంగరాలాబీడు , ఏటి అగ్రహారం, కోదండరామయ్య నగర్ , ఏటుకూరు రోడ్డు, వినోబా నగర్ , ఆంజనేయపేట , డొంకరోడ్డు, సీతారాం నగర్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు అధికారులు వివరించారు.
ఇక తాడేపల్లి మండలంలో 44, తెనాలి మండలం 6, చిలకలూరిపేట 5, దుగ్గిరాల 4, మాచర్ల 3, మంగళగిరి 2 కేసులు వచ్చాయి. నరసరావుపేట, తుళ్లూరు, నకరికల్లు, పేదకాకనిలో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో అత్యధిక కేసులు నమోదైన ప్రాంతాలు చూస్తే గుంటూరు 671, నర్సరావుపేట 258, తాడేపల్లి 234, మంగళగిరి 68, తెనాలి 76, పెదకాకాని 27, చిలకలూరిపేట29, దాచేపల్లి 24 కేసులు నమోదయ్యాయి.