ETV Bharat / state

కరోనా విజృంభణ : రెండు రోజులు..29 కేసులు ! - కరోనా విజృంభన : రెండు రోజులు..29 కేసులు !

గుంటూరు జిల్లాలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. రెండు రోజుల వ్యవధిలో 29 కేసులు నమోదయ్యాయి. శనివారం వచ్చిన ఫలితాల్లో 14 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఇందులో మంగళగిరిలో 4 కేసులు, నవులూరు 4, తాడేపల్లి 3, బాపట్ల 2, నరసరావుపేటలో ఒక కేసు నమోదైంది. వీరందరి ప్రాథమిక కాంటాక్ట్‌లను గుర్తించి క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. ద్వితీయ కాంటాక్ట్‌లను హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

కరోనా విజృంభన : రెండు రోజులు..29 కేసులు !

author img

By

Published : Jun 14, 2020, 1:48 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 631కి చేరింది. గుంటూరు, నరసరావుపేటలో కేసుల ఉద్ధృతి తగ్గి మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం వచ్చిన ఫలితాల్లో 14 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఇందులో మంగళగిరిలో 4 కేసులు, నవులూరు 4, తాడేపల్లి 3, బాపట్ల 2, నరసరావుపేటలో ఒక కేసు నమోదైంది. మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో కంటెన్మెంట్​ జోన్లు ఏర్పాటు చేసి మరింత పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు. ఆ ప్రాంతంలో అందరికీ పరీక్షలు నిర్వహించి వైరస్‌ విస్తరించకుండా చర్యలు చేపడుతున్నారు.

మరోవైపు హైరిస్క్‌గా కేంద్రం గుర్తించిన ఆరు రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టిసారించారు. జిల్లాలో ప్రవేశించిన వెంటనే వారందరికీ టెస్టులు చేసి క్వారంటైన్‌కు పంపుతున్నారు. ఏడు రోజుల తర్వాత మరోసారి పరీక్షించి నెగెటివ్‌ వస్తే ఇంటికి పంపి మరో ఏడు రోజులు క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. వీరిని స్థానిక వైద్య సిబ్బంది పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. దీనివల్ల పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారి నుంచి కరోనా వైరస్‌ విస్తరించకుండా కట్టడి చేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న కేసులు ఇప్పటికే పాజిటివ్‌ వచ్చిన ప్రాంతంలోనే వారికి కాంటాక్ట్‌ వల్ల వస్తున్న కేసులుగానే గుర్తించారు. పాజిటివ్‌ వచ్చిన కేసు మూలాలను గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. కంటెన్మెంట్​ జోన్లలో నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడం వల్ల వైరస్‌ వ్యాప్తిని అడ్డుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.

పది క్వారంటైన్‌ కేంద్రాల్లో 612 మంది జిల్లాలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల కాంటాక్ట్‌లను గుర్తించి ప్రాథమిక కాంటాక్ట్‌లను ప్రభుత్వం నిర్వహిస్తున్న క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇలా పది కేంద్రాల్లో ప్రస్తుతం 612 మంది ఉన్నారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల కుటుంబసభ్యులతో పాటు వారితో 15 నిమిషాల పాటు దగ్గరగా ఉన్న వారిని ప్రాథమిక కాంటాక్ట్‌లుగా గుర్తిస్తున్నారు. ఇరుగుపొరుగు వారు, కొంత దగ్గరగా ఉన్నవారిని ద్వితీయ కాంటాక్ట్‌గా గుర్తించి హోం క్వారంటైన్‌ చేస్తున్నారు. క్వారంటైన్‌లో ఉన్న వారికి ఏడు రోజుల వ్యవధిలో రెండుసార్లు పరీక్షలు నిర్వహించి నెగెటివ్‌ వస్తే ఇంటికి పంపుతున్నారు. ఈవిధంగా శనివారం రోజున 157 మంది డిశ్చార్జి అయి ఇళ్లకు వెళ్లారు. ఇప్పటివరకు క్వారంటైన్‌ కేంద్రాల నుంచి 5591 మంది ఇళ్లకు వెళ్లారు. అనారోగ్య కారణాలతో ఆసుపత్రులకు వస్తున్న వారిలో అనుమానం వస్తే కరోనా పరీక్షలు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.