ETV Bharat / state

గుంటూరు జిల్లాలో కరోనా విజృంభణ.. మొత్తం 731 కేసులు - గుంటూరు జిల్లాలో కరోనా కేసుల వార్తలు

గుంటూరు జిల్లాలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. బుధవారం 17 కొత్త కేసులు రాగా... మొత్తం పాజిటివ్ రోగుల సంఖ్య 731కి చేరింది. చిన్నచిన్న పట్టణాలు, గ్రామాల్లో కొత్త కేసులు రావటం అధికారుల్ని కలవరపెడుతోంది. జూన్ నెలలోనే 265 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ వచ్చిన కేసుల్లో మూడో వంతు ఈ 17 రోజుల్లోనే రావటం ఆందోళనకర అంశం.

corona cases in guntur district
గుంటూరు జిల్లాలో కరోనా విజృంభణ
author img

By

Published : Jun 17, 2020, 10:54 PM IST

రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ కేసుల్లో గుంటూరు జిల్లా మూడో స్థానంలో ఉంది. అయితే కేసుల నమోదు విషయంలో మాత్రం ఉద్ధృతి కనిపిస్తోంది. ఇప్పటి వరకు నమోదైన 731 కేసుల్లో కేవలం జూన్ నెలలోనే 265 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో బుధవారం నాడు 17 కేసులు నమోదయ్యాయి. ఇందులో గుంటూరులో 6, దాచేపల్లిలో 5, తాడేపల్లి, మంగళగిరి, పెదనందిపాడు, నర్సరావుపేట, బాపట్ల, చిలకలూరిపేట మండలం అప్పాపురంలో 1 కేసు చొప్పున ఉన్నాయి. వీరిలో 9 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిగా గుర్తించారు.

ఇప్పటికే వీరంతా క్వారంటైన్లలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొవిడ్ నిబంధనల ప్రకారం వీరిని క్వారంటైన్​కు తరలించి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​గా తేలింది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారి విషయంలో ఏపీ ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తోంది. ముఖ్యంగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారికి తప్పనిసరిగా నిర్ధరణ పరీక్షలు చేస్తున్నారు. అలాగే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే వారిలో అనుమానం ఉన్న వారికి కొవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి పరీక్షలు

ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల నుంచి రైళ్లలో వచ్చిన 669 మందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో 13 మందికి కరోనా నిర్ధరణ అయింది. మరో 70 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. ఇక విదేశాల నుంచి విమానాల్లో వచ్చిన 120మంది ప్రయాణికుల్లో 9 మంది పాజిటివ్​గా తేలారు. ఇంకా 30 మందికి సంబంధించిన నివేదికలు రావాలి. కార్లు, బస్సుల ద్వారా వచ్చిన 21 మందికి పాజిటివ్ వచ్చింది.

పరీక్షలు చేసిన వారిలో 95 శాతానికి పైగా నెగెటివ్

జిల్లాలోని 13 క్వారంటైన్ కేంద్రాల్లో 657 మందిని ఉంచారు. జిల్లాలో ఇప్పటి వరకూ 59,927 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 95.46శాతం మంది అంటే 57,205 మందికి నెగెటివ్ వచ్చింది. కరోనా బారిన పడిన వారిలో 515 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 216 మంది గుంటూరు జీజీహెచ్, మంగళగిరి ఎన్.ఆర్.ఐ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మరింత అప్రమత్తత అవసరం

కొత్త కేసులు నమోదైన ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేశారు. వారి ప్రైమరీ కాంటాక్టులు సేకరిస్తున్నారు. క్వారంటైన్​కు తరలించి అనుమానం ఉన్నవారికి పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. లాక్ డౌన్ ఆంక్షలు సడలిన తరుణంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని... బయటకు వచ్చే సమయంలో సరైన రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

ఇవీ చదవండి...

జిల్లా ఎస్పీని కలిసిన ఎంపీ గల్లాజయదేవ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.