గుంటూరు జిల్లాలో కొత్తగా 801 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 35వేల 654కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని 26వేల 199 మంది ఇళ్లకు చేరుకున్నారు. జిల్లాలో ఇవాళ కొత్తగా 4 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 359కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరంలోనే 135 ఉన్నాయి.
నర్సరావుపేటలో 78, పొన్నూరులో 57, మంగళగిరిలో 51, చెరుకుపల్లిలో 45, గురజాలలో 43, బాపట్లలో 38, తెనాలిలో 38, రెంటచింతలలో 38, మాచర్లలో 33, తాడేపల్లిలో 27, రొంపిచర్లలో 22, అచ్చంపేటలో 19, పెదకాకానిలో 19, పిడుగురాళ్లలో 16, దుగ్గిరాలలో 14, నకరికల్లులో 12, గుంటూరు గ్రామీణ మండలంలో 11, భట్టిప్రోలులో 10, అమరావతిలో 10 కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మిగతా మండలాల్లో 85 కేసులు వచ్చాయని బులిటెన్ విడుదల చేశారు. జిల్లాలో ఇప్పటి వరకూ 3లక్షల 34వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రతి పది లక్షల మందిలో 68వేల మందికి పరీక్షలు చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 11వేల 701 కేసులు నమోదయ్యాయి. ఇక నర్సరావుపేటలో 1700, తాడేపల్లిలో 1276 కేసులు వచ్చాయి.
ఇదీ చూడండి. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న ఏఎన్‌యూ