ఇన్నాళ్లూ గ్రీన్ జోన్లో ఉన్న గుంటూరు జిల్లా బాపట్లలో కరోనా పాజిటివ్ కేసు వెలుగుచూసింది. చెన్నై నుంచి వచ్చిన కర్లపాలెం మండలం బుద్దాం వాసి అయిన మహిళకు కరోనా సోకినట్లు పరీక్షల్లో తేలింది. ఆ మహిళ కుటుంబంతో కలిసి చెన్నైలో ఉంటోంది. ఈనెల 20న కుమారుడు, కుమార్తె, తల్లితో కలిసి కారులో నెల్లూరుకు వచ్చారు. అక్కడి నుంచి బాపట్ల చేరుకున్నారు.
ఈనెల 23న చీరాల ఆసుపత్రికి వెళ్లి ట్రూనాట్ పరీక్షలు చేయించుకున్నారు. వారిలో కరోనా లక్షణాలు కనిపించటంతో ఒంగోలులోని ఐసోలేషన్ కేంద్రానికి పంపించారు. ఆ మహిళ తల్లికి నెగెటివ్ రావటంతో చీరాల క్వారంటైన్లో ఉంచారు. ఒంగోలులో మహిళకు, ఆమె కుటుంబసభ్యులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. ఆమెకు పాజిటివ్‌గా నిర్ధరణయ్యింది. దీంతో అప్రమత్తమైన అధికారులు మహిళ ఇంటి చుట్టుపక్కల వారికి పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్లో ఉండాల్సిందిగా సూచించారు. ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించారు.
ఇవీ చదవండి.. 'చాక్లెట్ ఇచ్చి నక్లెస్ ఎత్తుకెళ్లినట్టే ఉంది ప్రభుత్వ పరిస్థితి'