రాజధాని అమరావతి నిర్మాణం కోసం గతంలో తీసుకొచ్చిన సామగ్రిని గుత్తేదారులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాజధాని గ్రామాలైన తుళ్లూరు నుంచి దొండపాడు వెళ్లే మార్గంలో రహదారి పక్కన ఉన్న పైపులను శనివారం భారీ క్రేన్ల సాయంతో తీసుకువెళ్లారు. కంపెనీలు ఇతర రాష్ట్రాల్లోని తమ ప్రాజెక్టుల పనుల కోసం వీటిని తరలిస్తున్నట్టు సమాచారం. వారిని ‘ప్రశ్నించగా గుత్తేదారు ఆదేశాల మేరకే పైపులను తరలిస్తున్నామని సమాధానమిచ్చారు.
ఇదీ చదవండి:
వర్షాలకు భారీగా దెబ్బతిన్న రోడ్లు.. నిధుల కొరతతో అరకొరగా మరమ్మతులు