గుంటూరు జిల్లా నరసరావుపేట డంపింగ్ యార్డులో ఒప్పంద కార్మికుడు మృతిచెందాడు. యార్డు వద్ద కత్తెర జకరయ్య ప్రమాదవశాత్తూ చెత్త సేకరణ యంత్రంలో పడి మరణించాడు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ... సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. మృతుని కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ప్రకటించాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన కలెక్టర్