ETV Bharat / state

'41 (ఏ)నోటీసు ఇవ్వకపోవటం కోర్టు ధిక్కరణ అవుతుంది' - హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత

సుప్రీం తీర్పు సీఆర్​పీసీ 41ఏ ప్రకారం నిందితులకు నోటీసులు ఇవ్వకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. నోటీసులు ఇవ్వలేదని పిటిషనర్ తరపు న్యాయవాది సాయి కుమార్ వాదనలు వినిపించగా.. స్పందించిన న్యాయమూర్తి కోర్టు ధిక్కారణగా పరిగణించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

41ఏపై కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు : హైకోర్ట్

author img

By

Published : Oct 29, 2020, 5:07 AM IST

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ మంగళగిరి పోలీసులు నమోదు చేసిన కేసులో హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు సీఆర్​పీసీ సెక్షన్ 41(ఏ) ప్రకారం నిందితులకు పోలీసులు నోటీసులు ఇవ్వకపోవడాన్ని కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకొని కోర్టు ధిక్కరణగా పరిగణించొచ్చని హెచ్చరించింది.

తదుపరి చర్యలు నిలుపుదల..

ఈ అంశంపై వివరంగా తీర్పు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ జె.సాంబశివరావుపై మంగళగిరి పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ కోర్టు నిలుపుదల చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

41ఏ నోటీసు ఇవ్వలేదు..

మంగళగిరి పట్టణ పోలీసులు ఈనెల 21న తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ ఉండవల్లికి చెందిన జె.సాంబశివరావు హైకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో రెండో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు 41ఏ నోటీసు ఇవ్వలేదని పిటిషనర్ తరపు న్యాయవాది సాయి కుమార్ వాదనలు వినిపించారు.

గరిష్టంగా 5 ఏళ్లలోపు..

ప్రస్తుత కేసులో నిందితులపై నమోదైన సెక్షన్ల కింద గరిష్ఠంగా 5 ఏళ్లలోపు శిక్ష మాత్రమే చట్టంలో పేర్కొన్నారన్నారు. గరిష్ఠంగా 7 ఏళ్ల లోపు శిక్షపడే కేసుల్లో నిందితులకు 41 ఏ నోటీసు తప్పనిసరిగా ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

సుప్రీంను ధిక్కరిస్తున్నారు..

పోలీసులు సుప్రీం తీర్పును పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని న్యాయస్థానానికి వివరించారు. పోలీసులు తమ ఆదేశాలను పాటించకపోతే సంబంధిత హైకోర్టులో కోర్టు ధిక్కారణ కేసులు దాఖలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపిందని వాదించారు.

సుమోటోగా తీసుకోవచ్చు..

న్యాయమూర్తి స్పందిస్తూ, సంబంధిత కేసును సుమోటోగా తీసుకోవచ్చని స్పష్టం చేశారు. న్యాయవాది బదులిస్తూ.. సుమోటోగా తీసుకుంటేనే ప్రజాస్వామ్యం రక్షించేందుకు వీలవుతుందన్నారు. ఫలితంగా సుప్రీం హుందాతనాన్ని కాపాడినట్లేనని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి : ప్రస్తుతం స్థానిక ఎన్నికల నిర్వహణ కష్టం: ప్రభుత్వం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.