Congress participates in farmers peaceful protests: అమరావతి రాజధాని నిర్మాణానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ తెలిపారు. అమరావతికి జరుగుతున్న అన్యాయంపై ఢిల్లీలో తమ బాధను తెలిపేందుకు ఈనెల 17 నుంచి 19 వరకు రైతులు చేస్తున్న శాంతియుత నిరసనలో తాము పాల్గొంటున్నామని పెర్కొన్నారు. ఈ నెల 16వ తేదినే కాంగ్రెస్ బృందం ఢిల్లీకి వెళ్లి 17 నుంచి రైతులతో పాటు నిరసనలో పాల్గొంటామన్నారు. అధికారం కోసం ముఖ్యమంత్రి జగన్ అమరావతి రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంధికారంలోకి వస్తే అమరావతినే ఆంద్రప్రదేశ్‌కి శాశ్వత రాజధానిగా చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారని గుర్తు చేశారు. అమరావతి రైతులు చేస్తున్న పోరాటాన్ని చూసి ముఖ్యమంత్రి జగన్ సిగ్గుపడాలన్నారు.
ఇవీ చదవండి: